ఓలా నుంచి ఊహించని సంచలనం.. ఓఎన్ఎన్ పేరుతో న్యూస్ చానల్!

  • జర్నలిజంలోకి ఓలా సంస్థ
  • ఓలా న్యూస్ నెట్‌వర్క్ పేరుతో బ్రాడ్‌కాస్టింగ్ సేవలు
  • సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న న్యూస్ వీడియో
ట్యాక్సీ సేవల సంస్థ ఓలా సరికొత్త రంగంలోకి అడుగుపెట్టింది. దేశంలోని అతిపెద్ద క్యాబ్ హైరింగ్ సంస్థ అయిన ఓలా.. తాజాగా జర్నలిజంలోకి ప్రవేశించింది. ‘ఓలా న్యూస్ నెట్‌వర్క్’ పేరుతో బ్రాడ్‌కాస్టింగ్ సేవలు ప్రారంభించింది. పది లక్షల మంది డ్రైవర్లతో దేశంలోని 110 నగరాల్లో సేవలు అందిస్తున్న ఓలా స్థానికంగా నాణ్యమైన వార్తలను వినియోగదారులకు అందించాలని  నిర్ణయించింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసింది. సోషల్ మీడియాలోనూ హల్‌చల్ చేస్తున్న ఈ వీడియో అంచనాలకు మించి ఉందని నెటిజన్లు చెబుతున్నారు. మరి, వీక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే. మీరూ ఓ లుక్కేయండి!
Go Back to Shorts
OLA
News
journalism
Ola News Network

More Telugu News